TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోన్ రికవరీ పేరిట దారుణం.. మహిళ కిడ్నాప్, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్.!

Published on: Sat Sep 5, 2026 10:10AM

లోన్ రికవరీ పేరిట ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన ముఠా ఉదంతమిది. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది.   అప్పుల వసూళ్ల కోసంఈ ముఠా అరాచకానికి పాల్పడింది. రుణం చెల్లించలేదన్న కారణంతో ఓ  ముప్పై ఏళ్ల మహిళను అపహరించి, రెండు రోజుల పాటు రహస్య ప్రాంతంలో బంధించి, హింసించడమే కాకుండా, ఆమెను వివస్త్రను చేసి వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరు  చంద్రాలయా అవుట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు గతంలో కొందరి వద్ద వడ్డీకి అప్పులు తీసుకుంది. అయితే అనుకున్న సమయానికి అసలు, వడ్డీ చెల్లించలేకపోవడంతో  వారు దారుణానికి పాల్పడ్డారు. నిందితులు ఆమెను, ఆమె మైనర్ కుమారుడిని  కిడ్నాప్ చేసి.. కుంబల్‌గోడు ప్రాంతంలో  ఒక నివాసంలో నిర్బంధించి హింసించారు. ఆమెను వివస్త్రను చేసి.. వీడియో తీసి.. ఆ   దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ  బ్లాక్ మెయిల్ చేశారు. అనంతరం    ఖాళీ పత్రాలు, డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.  లక్షన్నర రూపాయల అప్పు తీసుకున్న ఆమెను  11 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. 

కాగా బాధితురాలి కిడ్నాప్ పై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుల ఆచూకీ గుర్తించి  మహిళను   రక్షించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఈ దారుణానికి పాల్పడిన  నిందితులు రేష్మా బాను, సుహైల్, నజ్రత్ సహా మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.   పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

[Bengaluru loan recovery case, woman kidnapped, loan shark harassment, Chandra Layout police station, illegal loan recovery gang arrested]