ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్..ఇద్దరు విదేశీయులు మృతి.!
Published on: Sat Oct 31, 2026 7:40PM

బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా కరెంట్ ప్రసరించడంతో ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో పర్యాటక వర్గాలు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్‌గా పేరున్న ప్రాంగణంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతి చెందిన వారిని జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ (57), స్లోవేకియా దేశానికి చెందిన జురాజ్ హోర్వాత్ (45)గా గుర్తించారు. వీరిలో ఒకరు విమానయాన సిబ్బందిగా పనిచేస్తుండగా, మరొకరు ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సాయంత్రం సమయంలో హోటల్ మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో నీటిలో విద్యుత్ లీకై ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. వారిద్దరూ నీటిలోనే స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన మరో అమెరికన్ పర్యాచకుడు హోటల్ సిబ్బంది అయిన లైఫ్‌గార్డ్ వారిని రక్షించేందుకు సాహసోపేత ప్రయత్నం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో వారికి కూడా స్వల్పంగా విద్యుత్ షాక్ తగలడంతో పాటు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికి విదేశీయులు ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. రక్షణ చర్యల్లో గాయపడిన అమెరికా పర్యాచకుడు మరియు పూల్ అటెండర్ ప్రాణాపాయం నుండి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. హోటల్ యాజమాన్యం మరియు నిర్వహణ సిబ్బంది చేసిన తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమనే కోణంలో ఆరా తీస్తున్నారు. విద్యుత్ వైరింగ్ లోపాలు లేదా నీటి మోటార్ల లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
దేశ ఆర్థిక రాజధానులలో ఒకైన బెంగళూరులోని అంతర్జాతీయ స్థాయి హోటళ్లలో ఇటువంటి భద్రతా లోపాలు వెలుగుచూడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకుల భద్రతపై నీలీనీడలు కమ్ముకోవడంతో, హోటల్స్ రిసార్ట్‌ల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి.
[ Bengaluru hotel electrocution, Conrad hotel pool accident, foreign nationals die in India, Bangalore news, swimming pool electric shock ]


