వైట్ బాల్ క్రికెట్ లో టీమ్ ఇండియా సూపర్ పవర్.. పాక్ పై విజయం ఎప్పడూ ప్రత్యేకమే.!
Published on: Sat Oct 3, 2026 4:49PM

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో ఫైనల్ లో ఇండియా టీమ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అంతర్జాతీయ వైట్‌బాల్ క్రికెట్ రంగంలో భారత్ ఒక తిరుగులేని సూపర్‌పవర్‌గా అవతరించిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. టోర్నమెంట్ ఆసాంతం అసాధారణ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లను క్రీడావర్గాలు, బోర్డు పెద్దలు అభినందించారు.
.webp)
ఈ విజయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌పై విజయం సాధించడం ఎప్పుడూ ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందన్నారు. ముఖ్యంగా ఈ విజయంతో వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్ బలమైన ముద్రను వేసిందని, ప్రస్తుతం ఇండియా ఒక సూపర్‌పవర్‌గా కొనసాగుతోందని కొనియాడారు. పాకిస్థాన్‌పై దక్కిన ఈ ఘన విజయం దేశంలోని కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు అంతులేని ఆనందాన్ని పంచిందని పేర్కొన్నారు.

భారత క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న రిజర్వ్ బెంచ్ బలం, యువ ఆటగాళ్ల రాక ఈ విజయాల వెనుక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ క్రీడాకారులు కూడా ఒత్తిడిని జయించి కీలక మ్యాచ్‌లలో అద్భుతాలు చేయగలరని ఈ టోర్నీ నిరూపించింది. రాబోయే కాలంలో జరగబోయే కీలక అంతర్జాతీయ టోర్నమెంట్ల దృష్ట్యా యువ ఆటగాళ్ల ఈ ప్రదర్శన భారత జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.webp)
[BCCI Praises, Indian Cricket Team, Asian Games Gold Medal, Abhishek Sharma, White Ball Super Power, Telugu One]


