TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పలు రైళ్లు రద్దు: ఘాట్‌ రోడ్లలో ఆంక్షలు.. విజయనగరంలో స్కూళ్లకు సెలవు..!

Published on: Tue Sep 22, 2026 9:04PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. వాయు గుండం ప్రభావం పెరుగుతుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగం అప్రమత్త మైంది. ఇప్పటికే ముందస్తు చర్యలను ప్రారంభించిన అధికారులు.. ప్రజలు, రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయు గుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది క్రమంగా ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోంది. తీరాన్ని సమీపించే కొద్దీ గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్‌ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని తీవ్ర వాయుగుండంగా దాటే అవకాశముందని IMD తాజా అంచనాలు వెల్లడి స్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖలో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలతో పాటు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కళింగపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీ కృతం అవుతుంది. విశాఖకు 270 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిం చారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి, కృష్ణాజిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

 ఈ భారీ వర్షాల కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు వాయుగుండం ప్రభావం రైలు రాకపోకల పైనా పడుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖ-కొత్తవలస-కిరండోల్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో నిలిపివేయాలని నిర్ణయిం చినట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా రైల్వే మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు రైల్వే శాఖ నుంచి తాజా సమాచా రాన్ని తెలుసుకున్న తర్వాతే ప్రయాణాలు చేయాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతా ల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రాత్రి వేళల్లో భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

కొండ వాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమ త్తంగా ఉండాలని, పరిస్థితి తీవ్రంగా మారితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేం దుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.విజయనగరం జిల్లాలోనూ వర్షాలు కొనసాగుతుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్‌ 23న కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.సముద్ర పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రం లోకి వెళ్లవద్దని అధికా రులు హెచ్చరించారు. ట్రాలర్లు, బోట్లు, చిన్న నౌకల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది. 

పరిస్థితులను బట్టి రోడ్డు రవాణాతో పాటు అవసరమైతే హెలికాప్టర్‌ సేవలను కూడా నియంత్రించే పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు వెల్లడించారు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, హోర్డింగులు, పాత భవనాల సమీపంలో ఉండకూడదని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కాజ్‌వేల వద్ద రాకపోకలు చేయొద్దని హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాయుగుండం ప్రభావంతో రానున్న 24 నుంచి 48 గంటలు ఉత్తరాంధ్రకు కీలకంగా మారనున్నాయి. ప్రజలు ఆందోళనకు గురికాకుండా అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే అధికారిక హెచ్చరి కలను పాటించాలని అధికారులు కోరుతు న్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

 

 

 

[ Bay of Bengal Depression, Andhra Pradesh Weather, North Andhra, Visakhapatnam, Srikakulam, Vizianagaram, Heavy Rains, IMD Alert, Train Services Cancelled, Ghat Road Restrictions, Schools Holiday, Cyclone Alert ]