TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్తర్‌లో సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Published on: Sun Nov 8, 2026 1:42PM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు. దశాబ్దాల పాటు వామపక్ష తీవ్రవాదంతో అట్టుడికిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఆయన భద్రతా బలగాల మధ్య దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.   

చాలా కాలం తర్వాత దేశంలోని ప్రతి జిల్లా నక్సల్స్ బెడద నుంచి పూర్తిగా విముక్తి పొందిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి దీపావళి ఇదేనని ప్రధాని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. బస్తర్‌లోని కరన్‌పూర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి జవాన్లతో మమేకమై వారిని అభినందించారు.దేశ సరిహద్దులను కాపాడే సైనికులతో పాటు, అంతర్గత భద్రతను పటిష్టం చేస్తూ దేశం లోపల శత్రువులతో పోరాడుతున్న భద్రతా సిబ్బంది పాత్ర కూడా ఎంతో కీలకమని మోదీ అభివర్ణించారు. 

సంవత్సరాలుగా అసాధ్యంగా మారిన నక్సలిజం ఏరివేత కేవలం బలగాల అంకితభావం, త్యాగాల వల్లే సాధ్యమైందని కొనియాడారు.హింసాత్మక ఘటనలతో దెబ్బతిన్న ఈ ప్రాంతం నేడు ప్రశాంత వాతావరణంలో సరికొత్త అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాత్మక చర్యలు, తెగని పట్టుదలతో మావోయిజం వెన్నువిరిచామని, దీనివల్ల అమాయక ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయని పేర్కొన్నారు.

ఇప్పటివరకు నక్సల్స్ ప్రాబల్యంతో వెనుకబడిన బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీఠ వేసింది. రోడ్ల నిర్మాణం, మెరుగైన డిజిటల్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ శాఖల విస్తరణ వేగవంతం కావడంతో స్థానిక గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉందని ప్రధాని తెలిపారు. 

ఈ పండుగ వేళ దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించిన ఆయన, దేశ ఐక్యతకు భంగం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.శాంతి భద్రతలు పూర్తిగా అడుగుపెట్టిన బస్తర్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతుండటంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగై, ఈ ప్రాంతం దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలతో సమానంగా పురోగమిస్తుందని భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: శతవత్సరంలోకి అడుగుపెట్టిన బీజేపీ దిగ్గజం ఎల్.కె. అద్వానీ.!

 

 

[ Bastar Diwali celebrations pm modi, Naxalism free India, Chhattisgarh security forces, CoBRA base Karanpur, Left-wing extremism end, Diwali celebrations 2026, Indian Security Forces, CoBRA Commandos, Telugu One, Telugu News ]