TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.!

Published on: Wed Nov 25, 2026 1:43PM

అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!

అమ్మకు బంగారం కొనివ్వాలన్నది ఆ కొడుకు చిన్న కోరిక. ఆ ఆశను నెరవేర్చేందుకు ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మాడు. చివరకు తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకుని, మోసపోయానన్న తీవ్ర మనస్తాపంతో తనువు చాలించాడు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి చల్లా సంపత్ ఆత్మహత్య వెనుక ఉన్న విషాదకర నిజం ఇది.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్లా సంపత్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అతడి మరణానికి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కారణమని, అప్పుల బాధతోనే ప్రాణాలు తీసుకున్నాడని తొలుత ప్రచారం జరిగింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ప్రచారానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ తెరదించారు. సంపత్ ఆత్మహత్యకు బెట్టింగ్ యాప్స్‌తోగానీ, తోటి విద్యార్థులతోగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసిన విషయం మరింత విషాదకరం. తన తల్లికి బంగారం కొనివ్వాలన్న కోరికతో సంపత్ ఓ నకిలీ పెట్టుబడి పథకాన్ని నమ్మాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు ప్రచారం చేసిన జ్యువెలరీ షాపు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌కు ఆకర్షితుడయ్యాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆ పథకంలో తన వద్ద ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టాడు.

ఇది కూడ చవండి: చిన్న ఇస్త్రీ షాపు నుంచి లక్షల టర్నోవర్ దాకా..ముంబయి యువకుడి సక్సెస్ స్టోరీ.!

కానీ, డబ్బులు జమ చేసిన వెంటనే ఆ యాప్ మాయమైంది. పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని సంపత్ గుర్తించాడు. ఎంతో ఆశతో పెట్టుకున్న డబ్బు కళ్లముందే చేజారిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ జానకీ షర్మిళ.. ఇది సైబర్ నేరగాళ్ల చేతిలో జరిగిన మోసంగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా సంపత్ ప్రాణాలు తీసుకున్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టం చేశారు.

అమ్మకు బంగారం కొనివ్వాలన్న చిన్న ఆశ.. చివరకు ఓ విద్యార్థి జీవితాన్నే బలిగొన్న విషాదంగా మిగిలింది. ఇలాంటి నకిలీ పెట్టుబడి పథకాలు, టెలిగ్రామ్ లింకులు, తక్కువ సమయంలో భారీ లాభాలంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యాశకు గురిచేసే సైబర్ మోసాల పట్ల విద్యార్థులు, యువత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: మహా సీఎం సుప్రియా సూలీ: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. శరద్ పవార్ వ్యూహాత్మక అడుగులు..?

మీకు నచ్చవచ్చు: బీసీలకు రాజ్యాధికారం.. హైదరాబాద్‌పై గురి.. తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

[ Basara IIIT, Challa Sampath, Student Suicide, Nirmal SP Janaki Sharmila, Cyber Fraud, Online Investment Scam, Telegram Scam, Fake Jewellery Investment Scheme, Cyber Crime, Online Fraud, Betting Apps, Telangana News ]