TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెప్టెంబర్ 26 నుంచి ఐదురోజుల పాటు బ్యాంకులు బంద్: ఎందుకంటే.?

Published on: Wed Sep 23, 2026 10:01AM

దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28 నుంచి 30 వరకూ సమ్మెకు పిలుపునిచ్చారు.

 యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పిలుపు మేరకు బ్యాంకు సిబ్బంది సమ్మె చేయనుండటంతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.  అయితే బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మెకు తోడు సెప్టెంబర్ 26 సెకండ్ సాటర్ డే, సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.   

ఇంతకీ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏ యే డిమాండ్ లతో సమ్మెతు దిగుతున్నారంటే... వారి డిమాడ్ లలో ప్రధానంగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం   అన్ని శనివారాలూ సెలవులుగా ప్రకటించాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఊ ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినప్పటికీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతి రావాల్సి ఉంది.

అలాగే ఉద్యోగుల పని పరిస్థితులు, పెన్షన్‌కు సంబంధించిన అంశాలు కూడా బ్యాంకు సంఘాల ఆందోళనకు కారణంగా ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ, ఆ చర్చల్లో పురోగతి లేకపోవడంతో సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నాయి.  సమ్మె వల్ల బ్యాంకు శాఖల్లో క్యాష్ విత్ డ్రాయల్స్ చెక్కుల క్లియరెన్స్, ఇతర ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడుతుంది.  

సమ్మె సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని అంటున్నారు.   ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండకపోవచ్చంటున్నారు. ఇలా ఉండగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరుపుతోంది.  

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తోంది. సమ్మెలో పాల్గొనకుండా ఉద్యోగులు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.  

[Bank Strike, September 28, Bank Employees Strike, UFBU strike, Banking services,  Bank Customers, Telugu One]