బలూచిస్థాన్ లో పోలీసుల కిడ్నాప్: పాక్ ప్రభుత్వానికి వేర్పాటు వాదుల సవాల్.?
Published on: Sat Oct 17, 2026 6:22PM

పాకిస్థాన్లోని బలూచిస్థాన్ లో వేర్పాటువాదులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ పోలీసులు, సైనిక బలగాలే లక్ష్యంగా దాడులు సాగడం మామూలు విషయంగా మారిపోయింది. దేశంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పాక్ ప్రభుత్వం బలూచిస్తాన్ ప్రొవిన్స్లో ప్రకటించింది. అటువంటి బలూచిస్థాన్ లో 20 మంది పోలీసులను సాయుధులు కిడ్నాప్ చేశారు.
కాలాత్ రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్లో పోలీసు శిక్షణ పొందుతున్న పలువురు రిక్రూట్లు వీకెండ్ సెలవులకోసం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాన్ని క్వెట్టా కరాచీ హైవే మార్గంలో మస్తుంగ్ జిల్లాలోని గోర్గినా ప్రాంతం వద్ద కొందరు సాయుధులు అడ్డగించారు. వాహనంలో ఉన్న డ్రైవర్ తోపాటు ఇతర ప్రయాణికులను వదిలిపెట్టిన దుండగులు, శిక్షణలో ఉన్న 20 మంది పోలీసు అధికారులను కిడ్నాప్ చేసి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు.
ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే.. ఈ ప్రాంతంలో బలూచ్ వేర్పాటువాద గ్రూపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో వేర్పాటు వాదులే ఈ కిడ్నాప్ కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
.webp)
సమాచారం అందుకున్న వెంటనే పాకిస్థాన్ ప్రావిన్షియల్ పోలీసులు, సైనిక బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మస్తుంగ్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప పర్వత శ్రేణులలో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి, కిడ్నాపర్లు, బందీల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
[Balochistan Police Kidnapped, Pakistan, Kalat Police Training Centre Abduction, Pakistan Security Crisis Balochistan, Telugu One]


