Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాల్క సుమన్ అరెస్ట్
posted on: May 30, 2026 11:58AM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, గతంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి కేసులో కూడా బాల్క సుమన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
తాజాగా మరోసారి అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, అధికార పార్టీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటోందని చెబుతోంది. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






