TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం: రూ.39లక్షల రికార్డు ధర.!

Published on: Fri Sep 25, 2026 11:52AM

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలలో  బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాటకు ఒక ప్రత్యేకత ఉంది.   ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూసే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట శుక్రవారం (సెప్టెంబర్ 25()  ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. వేలంపాటలో బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్న వారికి  సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం ఉండటంతో, ఈసారీ వేలంలో పాల్గొనేందుకు భక్తులు  పోటీపడ్డారు.

ఈ ఏడాది నిర్వహించిన వేలంపాటలో మొత్తం తొమ్మిది మంది   పాలుపంచుకున్నారు. పోటాపోటీగా వేలం పాటపాడుటంతో ధర అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది.  చివకు ఈ వేలంలో సాహెబ్ నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి అందరి కంటే ఎక్కువ ధర పాడి లడ్డూను చేజిక్కించుకున్నారు.

 ఈ హోరాహోరీ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి .39 లక్షల రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ గణేశుడి లడ్డూ  సొంతం చేసుకున్నారు.    ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సాగుతున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ సారి మరో కొత్త రికార్డు సృష్టించింది.  


[Balapur Ganesh Laddu,  Balapur Laddu Auction, Sama Praneeth Reddy, Hyderabad Vinayaka celebrations, Telugu One]