తెలంగాణలో ఆటో ప్రయాణం ఇక ప్రియం.!
Published on: Sat Sep 5, 2026 12:37PM
తెలంగాణలో రోజువారీ ప్రయాణం చేసే సామాన్యలు ఆటోల్లో ప్రయాణించాలంటే ఇక ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
పెరిగిన ఇంధన ధరలు, విడిభాగాల ఖర్చులు, వాహనాల బీమా ప్రీమియంలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఆటో కార్మిక సంఘాలు గతంలో తలపెట్టిన సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రవాణా శాఖ అధికారులు కేరళ, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఆటో టారిఫ్ విధానాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఆటో ప్రయాణానికి సంబంధించిన కనీస ధర భారీగా పెరుగుతుంది.
ఇప్పటివరకు మొదటి రెండు కిలోమీటర్లకు అమలులో ఉన్న పద్ధతిని మార్చి, కొత్త నిబంధనల కింద మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీని 30 రూపాయలకు పెరిగే అవకావం ఉంది. అలాగే.. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు 11 నుంచి 14 రూపాయలకు పెరుగుతుంది. ఆటో రంగంలోని వాస్తవ ఖర్చులను బేరీజు వేసి ఈ పెంపును ఖరారు చేశారు.

కేవలం సాధారణ కిలోమీటర్ల చార్జీలే కాకుండా, ట్రాఫిక్ జామ్‌లలో ఆటో నిలిచిపోయినప్పుడు వర్తించే డిటెన్షన్ లేదా వెయిటింగ్ ఛార్జీలను కూడా కొత్త నిబంధనల్లో పొందుపరిచారు. దీని ప్రకారం ట్రాఫిక్‌లో ఆటో ఆగిన ప్రతి నిమిషానికి 75 పైసల వెయిటింగ్ ఛార్జీని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి మరో భారం తప్పదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగే ప్రయాణాలకు సాధారణ మీటర్ ఛార్జీపై అదనంగా 50 శాతం సర్ఛార్జ్ వసూలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. వీటితో పాటు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీ విషయానికి వస్తే, ఒక సాధారణ బ్రీఫ్‌కేస్ లేదా హ్యాండ్‌బ్యాగ్ మినహా ఇతర పెద్ద ప్యాకేజీలకు ప్రతి దానికి 50 పైసల చొప్పున అదనపు రుసుము చెల్లించాలని, గరిష్టంగా 100 కిలోల వరకు లగేజీని అనుమతించవచ్చని పేర్కొన్నారు.
[Auto Fare Hike Telangana, minimum auto fare RS30, Transport Committee Recomand, Hyderabad Auto Charges, Auto Meter Tariff, Telugu One]


