అరబిందో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం: తప్పిన ప్రాణ నష్టం.!
Published on: Fri Oct 23, 2026 11:12AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఫార్మా సిటీలోని అరబిందో ఫార్మా యూనిట్లో శుక్రవారం (అక్టోబర్ 23) ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో కార్మికులు ప్రాణ భయంతో ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు. యూనిట్ 15లోని ప్రొడక్షన్ బ్లాక్లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా యూనిట్ అంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణంగా షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అ ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారించేందుకు సంబంధిత శాఖల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
.webp)
హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సంప్రదింపులు జరిపి, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
[Aurobindo Pharma Fire Accident, Parawada Pharma City, Anakapalli, Home Minister Anita, Order, Probe, Telugu One]


