TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆగస్టు 29 టారో రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా జాక్‌పాట్ ఖాయం!

Published on: Sat Aug 29, 2026 10:33AM

2026 ఆగస్టు 29వ తేదీ టారో కార్డుల విశ్లేషణ ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. మీ రాశి ప్రకారం ఈ రోజు మీకు ఎలా ఉండబోతుందో వివరణాత్మకంగా చూద్దాం. ముందుగా మేష రాశి వారికి కార్యాలయంలో పాత పనులే మళ్లీ చేయాల్సి రావడం వల్ల కాస్త విసుగు అనిపించవచ్చు. ఆర్థికంగా అంతర్జాతీయ మార్కెట్లను నిశితంగా గమనించడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోను మెరుగ్గా ప్లాన్ చేసుకోగలరు. వైద్య, ఫార్మా, ఫిట్‌నెస్ రంగాలలో ఉద్యోగాలు వెతికే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక జీర్ణవ్యవస్థ, కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. వృషభ రాశి వారి విషయానికి వస్తే, మీ కష్టానికి ఇతరులు క్రెడిట్ కొట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు నమ్మి తొందరపడకూడదు. శస్త్రచికిత్స చేయించుకునే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

మిథున రాశి వారికి ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరించడానికి మనసు రాకపోవచ్చు. వైద్యపరమైన అవసరాల కోసం కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, మంచి విద్యార్హత కలిగిన జీవిత భాగస్వామి సంబంధాలు సింగిల్స్‌కు లభిస్తాయి. కర్కాటక రాశి వారు స్పష్టత లేకపోవడం వల్ల ఎక్కువ పనులను తలకెత్తుకునే అవకాశం ఉంది. స్వంత ఆరోగ్యం, సంరక్షణ కోసం ఖర్చులు పెరుగుతాయి. అలాగే సింగిల్స్ మోసపూరిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి ఉద్యోగులకు సరైన బడ్జెట్ ప్లానింగ్ వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. అయితే తొందరపాటులో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి నష్టపోకండి. మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కన్యా రాశి వారు ఆర్థిక నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఆర్థికంగా ఈ రోజు లబ్ధి చేకూరుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

తులా రాశి వారికి రాబక బకాయిలు, పాత అప్పులు వసూలు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు. వ్యాపార అభివృద్ధి, రికవరీ విభాగాల్లో ఉన్నవారికి ఇది కలిసివస్తుంది. శస్త్రచికిత్స చేయించుకునే తులా రాశి వారికి మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి పురోగతి సాధిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మెరుగైన జీతంతో కూడిన నూతన ఉద్యోగాలు లభించి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. వివాహ రిజిస్ట్రేషన్ ప్లాన్ చేసుకునే వారికి ఈ రోజు శుభప్రదం. ధనూ రాశి వారు మీ సొంత నిర్ణయాల కంటే నిపుణుల సలహాలను పాటించడం వల్ల సఫలీకృతులవుతారు. మీడియా, గ్లామర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. లీగల్ విషయాలలో నిరాశ ఎదురయ్యే సూచనలు ఉన్నందున అంచనాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

 

 

 

telugu rasi phalalu august 29,tarot card reading vastu tips,astrology predictions august 2026.