ఆసీయా గేమ్స్: క్రికెట్ ఫైనల్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. స్వర్ణం కైవసం.!
Published on: Sat Oct 3, 2026 4:22PM

టీమ్ ఇండియా దాదాది దేశం పాకిస్థాన్ పై తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా ఆసియా క్రీడలలో భాగంగా పాకిస్థాన్ తో శనివారం (అక్టోబర్ 3) జరిగిన ఫైనల్ లో పాకిస్థాన్ ను 19 పరుగుల తేడాతో మట్టి కరిపించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. జపాన్‌లోని నిషిన్‌లో శనివారం ( అక్టోబర్ 3) జరిగిన హైవోల్టేజ్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టటీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తరువాత 212 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 192 పరుగులకే పరిమితమై పరాజయాన్ని మూటగట్టుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చాడు. తొలి బంతి నుంచే పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయంటే అభిషేక్ శర్మ ఏ రీతిలో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడో అవగతమౌతుంది.
.webp)
ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 21, ఇషాన్ కిషన్ 20 పరుగులతో తమ వంతు సహకారం అందించారు. మధ్యలో పాకిస్థాన్ బౌలర్లు వరుస వికెట్లు తీసి భారత పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా, తిలక్ వర్మ వారి పప్పులుడక నివ్వలేదు. తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు సాధించి భారత స్కోరును 200 పరుగుల మార్కు దాటించాడు. శివమ్ దూబే 14 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

ఇక 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఒత్తిడికి గురైంది. అయితే పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ హీరోచిత పోరాటంతో జట్టును ఆదుకోవడానికి శతధా ప్రయత్నించాడు. 51 బంతుల్లో 96 పరుగులు సాధించి పాక్ శిబిరంలో విజయంపై ఆశలు రేపాడు.
.webp)
అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సైమ్ అయూబ్ 29 పరుగులతో నవాజ్‌కు సహకరించాడు. వీ అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే తలో రెండు వికెట్లు పడగొట్టారు. చివరి ఓవర్‌లో శివమ్ దూబే హసన్ నవాజ్ వికెట్‌ను పడగొట్టడంతో భారత విజయం ఖరారైంది. ఈ పోటీలో పాకిస్థాన్ రజత పతకాన్ని సాధించగా, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన శ్రీలంక కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
[Asian Games Cricket, Gold Medal India, Beat Pakistan, India Retain Gold Medal, Abhishek Sharma Tilak Varma, India vs Pakistan Asian Games final, Telugu One]


