ఆసియా గేమ్స్: క్రికెట్ లో ఫైనల్ కు చేరిన పాకిస్థాన్.. తుదిపోరుతో ఎవరితో తలపడుతుందంటే.?
Published on: Thu Oct 1, 2026 10:54AM

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ లో పాకిస్థాన్ తొలి సారిగా ఫైనల్ కు చేరింది. సెమీస్ లో బంగ్లాదేశ్ పై గెలిచి.. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పుడు ఈ జట్టు గురువారం (అక్టోబర్ 1)న టీమ్ ఇండియా, శ్రీలంక మధ్య జరిగే మరో సెమీస్ లో విజేత జట్టుతో ఫైనల్ లో తలబడుతుంది. కాగా బంగ్లాదేశ్ లో జరిగిన సెమీస్ పాకిస్థాన్ చెమటోడ్చి గెలిచింది. వర్షం కారణంగా ఓవర్లను కదించిన ఈ మ్యాచ్ ను 13 ఓవర్ల కు కుదించారు. తేమ, పగుళ్లు ఉండటంతో మ్యాచ్ ప్రారంభం నుంచి పిచ్‌పై బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆరంభంలో 45 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత తౌహిద్ హృదోయ్ ఒంటరి పోరాటంతో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి జట్టు స్కోరును గౌరవప్రదమైన స్థితికి చేర్చాడు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.
.webp)
112 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు కూడా ఆరంభంలో తడబడింది. అబ్దుల్ సమద్ 15 బంతుల్లో 30 పరుగులు, హసన్ నవాజ్ 22 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆసియా క్రీడల చరిత్రలో పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా ఫైనల్‌లోకి ప్రవేశించినట్లయింది. గతంలో 2010 జరిగిన ఆసియా క్రీడలలో పాకిస్థాన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
[Asia Games Pakistan Cricket, Pakistan reaches cricket final, Pakistan vs Bangladesh Semi Final, Telugu One]


