TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐ కాదు ఎస్ఐ: ట్రంప్ కు ఎలాన్ మస్క్ మద్దతు.. స్పేస్ఎక్స్ఎస్ఐ.!

Published on: Mon Oct 5, 2026 11:32AM

అగ్రరాజ్యాధినేత డొలాల్డ్ ట్రంప్ ఆలోచనకు, ప్రతిపాదనకు టెక్ దిగ్గజనం ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ఇక నుంచి సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ)గా పిలవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడం, పిలుపునివ్వడమే కాకుండా, అమెరికా వ్యాప్తంగా ఏఐ అన్న పేరు వినియోగాన్ని నిషేధిస్తూ, ఇక నుంచి దానికి సూపర్ ఇంటెలిజెన్స్ గా పిలవాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కూడా చేశారు. అదలా ఉంటే..

ట్రంప్ ఆలోచనకు టెక్క దిగ్గజం ఎలాన్ మస్క్ పూర్తిగా ఆమోదించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  నో మోర్ ఏఐ,  ఎస్ఐ ఐటీజ్ బెటర్ అంటూ పోస్టు చేశారు. దీనిపై నెటిజనులు, స్పేస్ ఎక్స్ ను స్పేస్ ఎక్స్ ఎస్ఐగా పేరు మారుస్తారా అంటూ ప్రశ్నించారు. దీనికి క్షణం ఆలోచించకుండా స్పందించిన మస్క్ మారుస్తామంటూ బదులిచ్చారు.  దీంతో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఇక ముందు స్పేస్ ఎక్స్ ఎస్ఐగా మారనుంది. అయితే ఈ కొత్త పేరు ఎప్పటి నుంచి వాడుకలోకి వస్తుందన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకూ ఎలాన్ మస్క్ క్లారిటీ ఇవ్వలేదు. 

సెప్టెంబర్ 29న ట్రంప్  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన నాటి నుంచి అమెరికా ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు తమ అధికారిక కమ్యూనికేషన్లు, విధాన పత్రాలు, వెబ్‌సైట్లు ఇలా అన్నిటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి బదులు సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) అనే ఉపయోగిస్తున్నారు.  

అది పక్కన పెడితో.. స్పేసెక్స్ పేరును స్పేసెక్స్ ఎస్ఐగా మార్చాలని ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మస్క్ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొందరు పేరు మారినంత మాత్రాన సాంకేతికత మారిపోతుందా అని పెదవి విరుస్తున్నారు.  


[Artificial Inteligencem AI, Super Intelignce, SI, Donald Trump, Elon Musk, AI Name Change,  SpaceXSI, Telugu One]