TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నబ్ ఎఫెక్ట్: కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్డు మూసి వేత.. అలల ఉధృతికి కొట్టుకుపోయిన వాహనాలు.!

Published on: Tue Oct 27, 2026 3:17PM

అర్నబ్ తుఫాను ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై తీవ్రంగా కనిపిస్తోంది.  ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధతికి రోడ్డు బీటలు వారింది,  ఉప్పాడ తీరంలో సముద్రంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల నిర్మించిన రక్షణ గోడను దాటి అలలు రోడ్డుపైకి, ఇళ్ల వైపు దూసుకొస్తున్నాయి.

ఈ అలల ధాటికి రోడ్డుపైఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. అంతకంతకూ అలల ఉధృతి పెరుగుతుండటంతో ఉప్పాడి, కాకినాడ బీచ్ రోడ్డును మూసివేసిన అధికారులు రాకపోకలను నిలిపివేారు. కాగా అలల ఉధృతికి బీచ్ రోడ్డుపైకి భారీ బండరాళ్లు కొట్టుకు వచ్చాయి. గతంలో ఎన్నడూ సముద్రం ఇంత ప్రళయ భీకరంగా ఉండటం చూడలేదని స్థానికులు అంటున్నారు. నిముషనిముషానికీ అలల ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

[Arnb Effect Kakinada Uppada beach Road Closed, Super Tides, Vehicles Washed Away, Telugu One]