TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెరువుల్లా మారిన రోడ్లు: బందర్ పై అర్నాబ్ ఎఫెక్ట్.!

Published on: Wed Oct 28, 2026 10:26AM

అర్నాబ్ తుపాను ప్రభావం బందర్ పై ప్రస్ఫుటంగా కనిపించింది. బందర్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లకు అడ్డంగా కూలిపోయిన వృక్షాలు, విద్యుత్ స్తాంభాలే కనిపిస్తున్నాయి. బందర్ లోని కూడళ్లు   ఎస్పీ కార్యాలయ పరిసర ప్రాంతాలు కలెక్టర్ బంగ్లా,  లక్ష్మీ టాకీస్ సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లో భారీ చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. వీటితో పాటు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బందర్ లోని చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.  

ఇక భారీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే రహదారులపై నీటిని తొలగించే పనులు కూడా శరవేగంగా చేపట్టారు.  అయితే తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, వర్షం కురుస్తుండటంతో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.  


[Arnab Effect On Bandar, Machilipatnam Cyclone Arnab, Heavy Rains, Current Poles, Trees Fall, Streets Water logged, Telugu One]