TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నబ్ ఎఫెక్ట్: రైళ్లు రద్దు.. విమాన సర్వీసులకు బ్రేక్.!

Published on: Wed Oct 28, 2026 9:32AM

ఆంధ్రప్రదేశ్‌ను పెను తుపాను అర్నబ్ అతలాకుతలం చేసింది. అత్యంత భారీ వర్షాలు, ప్రచండ గాలులతో రాష్ట్రంలో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది.  తుపాను కారణగా  బస్సు,రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని తీర ప్రాంత గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపివేశారు. దాదాపు 50 రైళ్లు రద్దయ్యాయి.  ఇక గన్నవరం ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలు బంద్ చేశారు.  తుపాను కారణంగా  ఇండిగో, ఫ్లై 91, ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి.  

అదలా ఉంటే.. ఉప్పాడ  తీరంలో సముద్రం ప్రళయ భీకరంగా మారింది. రాకాసి అలల తాకిడికి  బీచ్ రోడ్డు కోతకు గురైంది. బండరాళ్లు సైతంకొట్టుకుపోయాయి. పల్లిపేట, రంగంపేట గ్రామాలను సముద్ర నీరు ముంచెత్తింది.  తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో 12 గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే  ఉభయ గోదావరి. కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు,  జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే  విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం  పల్నాడు, గుంటూరు, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  

[Arnab Cyclone Effect, Several, Trains, Flights, Busses, Cancelled, Red, Allert, Issued, Telugu One]