TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు కోట్ల రూపాయలతో సీఎం చంద్రబాబుకు కొత్త కాన్వాయ్: భద్రత దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం.!

Published on: Sun Nov 15, 2026 1:10PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటనల భద్రత  మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త    పర్యటనలకు వీలుగా,   అధునాతన సాంకేతిక హంగులతో  సరికొత్త కాన్వాయ్‌ను సమకూర్చడానికి నిర్ణయించింది. ఇందుకు అధికారిక అనుమతులు మంజూరు చేసింది.  ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు   రెండు కోట్ల రూపాయల   వ్యయంతో  కొత్త కాన్వాయ్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

ఈ  కొత్త కాన్వాయ్ కొనుగోలుకు సంబంధించి విస్వసనీయంగా అందిన సమాచారం మేరకు  వాహనాల కొనుగోలుకు వ్యయం 1.78 కోట్ల రూపాయలు కాగా,  ఆ వాహనాలకు అవసరమైన ఇతర అదనపు ఖర్చుల కోసం మిగిలిన సొమ్ము కలుపుకుని మొత్తం  2 కోట్లరూపాయలు ఖర్చు చేయనుంది.   తద్వారా  ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, సుదీర్ఘ ప్రయాణాల్లో అధికారులు, పారిశ్రామికవేత్తలు,  మీడియా ప్రతినిధులతో ప్రయాణంలోనే చర్చలు జరిపేలా విశాలమైన వసతులు ఉండేలా ఈ వాహనాలను డిజైన్ చేయిస్తున్నారు.

 ఈ కొత్త కాన్వాయ్‌లో మొత్తం ఆరు వాహనాలు ఉంంటాయి. ఒక్కో వాహనం కొనుగోలుకు 26 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.    ఫోర్స్ అర్బానియా 4400 డబ్ల్యూబీ  మోడల్ వాహనాలను ఈ కాన్వాయ్ కోసం ఎంపిక చేశారు. ఈ వాహనాల్లో ఒకేసారి ఎనిమిది మంది కూర్చునే   విశాలమైన స్థలంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి.  గతంలో అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న కాన్వాయ్ కంటే, ఈ తాజా వాహనాలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయంటున్నారు. 

వాస్తవానికి గతంలో ప్రభుత్వ ఖర్చులు,  పొదుపు చర్యల్లో భాగంగా కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం  ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు మొదలుకొని మంత్రుల వరకు అందరూ ఇప్పటికే ఉన్న వాహనాలనే వినియోగించాలని, కొత్తగా కార్లు కొనుగోలు చేయరాదని గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇది కూడా చదవండి:  నా కాన్వాయ్‌ వాహనాలు తగ్గించండి...సీఎం చంద్రబాబు ఆదేశాలు

అయితే, ముఖ్యమంత్రి హోదాలో నిరంతరం ప్రజల్లో ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు విపరీతంగా పెరగడం,   భద్రతా పరమైన ప్రోటోకాల్స్ దృష్ట్యా ఈ ప్రత్యేక మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాన్వాయ్ పూర్తిగా ముఖ్యమంత్రికే పరిమితం కానుందని, ఇతర మంత్రులకు మాత్రం పాత వాహనాలే కేటాయించనున్నట్లు స్పష్టమైంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ప్రజాక్షేత్రం పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పరిపాలనా పరమైన వేగం పెంచడానికి,  క్షేత్రస్థాయిలో పర్యటించేటప్పుడు ఎలాంటి సాంకేతిక లేదా రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ   కాన్వాయ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  

మీకు నచ్చవచ్చు:  మూడేళ్ల తర్వాత భారత్‌కు పాక్ మంత్రి.. ఎందుకో తెలుసా?

తెలంగాణ కాంగ్రెస్‌‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌.!

[APCM, CBN, Nwecanvoy, 2crorecost, Sixvehicles, TeluguOne]