12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్: అభ్యంతరాల నవేదనకు తుది గడువు డిసెంబర్ 31.!
Published on: Tue Nov 17, 2026 10:53AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలతో చంద్రబాబు సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు, సంబంధిత వర్గాలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల 31 వరకు గడువు విధించింది.
ఈ నిర్ణీత గడువులోగా వివిధ ఉద్యోగ సంఘాల నుంచి అందే అభిప్రాయాలను పీఆర్సీ పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అయితే యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపక వర్గాలతో పాటు జాతీయ న్యాయ వేతన సంఘం పరిధికి చెందే న్యాయాధికారులకు ఈ పీఆర్సీ వర్తించదు. ఈ విషయాన్ని ప్రభుత్వం మార్గదర్శకాలలో విస్సష్టంగా పేర్కొంది.
ప్రస్తుతం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఎయిడెడ్ విద్యాసంస్థలు అలాగే విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులు, శాశ్వత ప్రాతిపదికన ఉన్న కంటింజెంట్ సిబ్బంది జీతభత్యాలపై మాత్రమే పీఆర్సీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అమల్లో ఉన్న డీఏను మూలవేతనంలో ఏ ప్రాతిపదికన విలీనం చేయాలి, నూతన పే స్కేట్ల రూపకల్పన ఏ విధంగా ఉండాలనే అంశాలపై పీఆర్సీ దృష్టి పెడుతుంది.

అదే విధంగా, ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలులో తలెత్తుతున్న సమస్యలను సమీక్షించి, దానిని మరింత మెరుగుపరచడం లేదా తగిన మార్పులు చేయడంపై పీఆర్సీ సిఫారసులు చేయనుంది.
ఇది కూడా చదవండి: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
వీటితో పాటు స్పెషల్ పే, అలవెన్సులు, పెన్షనర్లకు వర్తించే ప్రస్తుత పింఛను విధానాన్ని కూడా పీఆర్సీ పరిశీలిస్తుంది. ఉద్యోగ పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చడం, కాంట్రాక్ట్, డిప్యుటేషన్ నిబంధనల ఆధారంగా వివిధ శాఖలవారీగా మానవ వనరుల అవసరాలపై కూడా పీఆర్సీ దృష్టి సారిస్తుంది.

ఉద్యోగ సంఘాలు, సిబ్బంది నుంచి డిసెంబర్ 31లోగా వచ్చే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం కమిషన్‌కు సూచించింది. రాబోయే కాలంలో ఉద్యోగుల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి మధ్య సమతుల్యత సాధించేలా పీఆర్సీ సిఫారసులు ఉండాలని ప్రభుత్వపేర్కొంది. గడువులోగా ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులు కోరారు.
మీకు నచ్చవచ్చు: మెగా డీఎస్సీపై పిల్.. ఏపీ హైకోర్టు ఏమందంటే?
మెగా డీఎస్సీపై వైసీపీ పోరుకు కోర్టు తీర్పు ఎండ్ కార్డ్.!
[AP12thPRC, AndhraPradesh, Government, PRCguidelines, TeluguOne]


