ఏపీని వదలనంటున్న వానలు: మరో వారం కుంభవృష్టి తప్పదు.!
Published on: Wed Oct 28, 2026 3:18PM

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది.
.webp)
మరీ ముఖ్యంగా అర్నాబ్ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రకటించింది కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అర్నాబ్ తుపాను సృష్టించిన విలయంతో ఇప్పటికే కోస్తా తీరం అస్తవ్యస్తం కాగా, తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో తీరప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకుగురౌతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ రానున్న నాలుగు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
[AP weather Alert, Heavt Rains, One More, Week, IMD, Caution, Telugu One]


