వర్షాంధ్రప్రదేశ్: మరో నాలుగు రోజులు వానలే వానలు.!
Published on: Thu Oct 15, 2026 6:31PM
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. సముద్రం అలకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో అధికార యంత్రాంగం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
[AP rain alert IMD, Heavy Rains AP, IMD Weather Warning, Andhra Pradesh weather, AP districts Rains Update, Telugu One]


