TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్.. మొత్తం 2050 పోస్టులకు నోటిఫికేషన్.!

Published on: Wed Sep 16, 2026 3:55PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక   శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగులు పడుతున్న తరుణంలో, పోలీసు శాఖతో పాటు అనుబంధ విభాగాలలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో నిరుద్యోగ వర్గాల్లో నూతనోత్సాహం సంతరించుకుంది. ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్  ఆధ్వర్యంలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల అయ్యాయి. 

విడుదలైన   అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని వివిధ భద్రతా, అనుబంధ శాఖలలోని ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కేవలం సాధారణ పోలీసు విభాగమే కాకుండా, అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ,  పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ వంటి   కీలక విభాగానికి చెందిన పోస్టులను ఈ జాబితాలో చేర్చారు.   అభ్యర్థుల అంచనాలకు తగ్గట్టుగా విభిన్న కేటగిరీలలో ఈ పోస్టుల విభజన జరగడం విశేషం. సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్,  సాంకేతిక నిపుణుల పోస్టుల వరకు అన్నీ ఈ నోటిఫికేషన్ల పరిధిలోకి రావడం వల్ల అర్హత కలిగిన వారికి అవకాశం లభించనుంది.

ఈ మొత్తం నియామక ప్రక్రియలో భాగంగా సబ్ ఇన్‌స్పెక్టర్   కేటగిరీలో వివిధ విభాగాల కింద  పోస్టులను కేటాయించారు. ప్రాథమికంగా సివిల్ ఎస్ఐ విభాగంలో  253 పోస్టులు ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ (  విభాగంలో 116 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్  పరిధిలో 9 పోస్టులు, కమ్యూనికేషన్స్ విభాగంలో 50 పోస్టులు, అలాగే పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగంలో మరో 10 ఎస్ఐ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

మరోవైపు కానిస్టేబుల్, ఇతర అనుబంధ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా   చేపట్టడం జరిగింది. మొత్తం కానిస్టేబుల్ కేటగిరీలో 1,156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542 ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు 285 వరకు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జైళ్లు,  సంస్కరణ సేవల శాఖలో పురుష, మహిళా వార్డర్ పోస్టులు కలుపుకుని మొత్తం 171 పోస్టులను కేటాయించారు. అలాగే కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కింద 198,  డ్రైవర్  మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టంచేశారు.

ఇక సాంకేతిక, శాస్త్రీయ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ  పరిధిలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లో చేర్చింది. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, అలాగే బయాలజీ, సెరాలజీ విభాగంలో 20 పోస్టులు  ఉన్నాయి.   ఈ ఉద్యోగాలన్నింటికీ సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ల వివరాలు మరియు రాత పరీక్షల తేదీలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలోనే   ప్రకటించనున్నారు.

గతంలో విడుదలైన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి నియామక ప్రక్రియను మరింత పకడ్బందీగా,  వేగవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 


[AP Police Recruitment 2026, AP Police Jobs, SI and Constable Vacancies, APSLPRB Notifications, Andhra Pradesh Government Jobs]