కొత్త పింఛన్ దరఖాస్తు ప్రక్రియను సులభం చేసిన ఏపీ సర్కార్.. ఆ నిబంధన తొలగించింది.!
Published on: Tue Sep 8, 2026 3:06PM

కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను త సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పింఛన్లు అందించే లక్ష్యంతో నిబంధనలను సడలించింది. పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇప్పటివరకు సమర్పించాల్సి వస్తున్న న్ను అసెస్‌మెంట్ నంబర్‌ను తప్పని సరిజాబితా నుంచి తొలగిస్తూ మంగళవారం (సెప్టెంబర్ 7) ఉత్తర్వ్యులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకుచేపట్టిన చర్యలలో భాగంగా కొత్త పింఛన్ల దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ముమ్మరం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి విదితమే. పట్టణ ప్రాంతాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ నివాసానికి సంబంధించి ఇంటి పన్ను అసెస్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది.

ఈ నిబంధన కారణంగా పట్టణాల్లో నివసించే ఎంతోమంది అర్హులైన పేదలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇళ్లు అద్దెకు ఉండేవారు లేదా పన్ను అసెస్‌మెంట్ ప్రక్రియ పూర్తి కాని ఇళ్లలో నివసిస్తున్న వారు ఈ నంబర్‌ను అందించలేక ఆందోళనకు గురయ్యారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం ఈ సాంకేతిక సమస్య కారణంగా తమ దరఖాస్తులు తిరస్కరించబడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో, ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి ఆ నింబంధనను తొలగించింది. పట్టణ ప్రాంతాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులకు ఇంటి పన్ను అసెస్‌మెంట్ నంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి కాదని పేర్కొంది.
ఈ నిబంధన సడలింపునకు అనుగుణంగా సంబంధిత అధికారిక వెబ్‌సైట్లలో కూడా తగిన మార్పులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వెసులుబాటు అమల్లోకి రావడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎంతో ఊరట లభించనుంది.జగన్ హయాంలో అమలులో ఉన్న ఈ కఠినమైన నిబంధనను తొలగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
[AP new pensions, Andhra Pradesh government, house tax assessment number exemption, swarna grama swarna ward secretariats, pension application process AP, Telugu One]


