TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: బాబు, పవన్, మాధవ్ సంయుక్త ప్రకటన.!

Published on: Thu Oct 22, 2026 10:13AM

ఆంధ్రప్రదేశ్‌లో  మునిసిపల్ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.   ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం  నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలుగుదేశం కూటమి పార్టీలుపేర్కొన్నాయి.  రాజ్యాంగ వ్యవస్థల నిర్ణయాలను గౌరవిస్తామంటూ తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు,  రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో భాగంగా పారదర్శకమైన పాలన అందించేందుకు స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమని, అయితే విపక్షాల వైఖరి వల్ల ఈ ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నాయని వారా ప్రకటనలో విమర్శించారు.

రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, స్థానిక సంస్థల అభివృద్ధి, కేంద్ర నిధుల సద్వినియోగం వంటి అంశాలపై వైసీపీకి ఇసుమంతైనా బాధ్యత లేదని కూటమి పార్టీల అగ్రనేతలు ఆప్రకటనలో దుయ్యబట్టారు.  మొదటి నుంచీ స్థానిక ఎన్నికలను ఏదో ఒక విధంగా అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే   వైసీపీ కుట్రలు పన్నుతోందని పేర్కొన్న వారు,  ఎన్నికలను నిలిపివేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియను అస్తవ్యస్తం చేయడమే లక్ష్యంగా వైసీపీ ఏకంగా 59 పిటిషన్లను వేర్వేరు కోర్టులలో దాఖలు చేసిందన్నారు.  

న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయి ఎన్నికల ప్రక్రియ మళ్ళీ గాడినపడి ప్రారంభమయ్యే కీలక సమయంలో కూడా రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వైసీపీ తీరు ఉందని విమర్శించారు.  రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో,  నిజాయతీగా జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి నాయకులు పునరుద్ఘాటించారు. ఎన్నికల సంఘం ఏ దిశగా అడుగులు వేసినా, ఎటువంటి సంస్కరణలు చేపట్టినా దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.  

[AP Municipal Elections Postponed, Ap Election Commission, Ruling Coalition, Chandrababu naidu, Pawan kalyan, Madhav, AP Politics, Telugu One]