మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపు: సాయంత్రానికల్లా ఫలితాలు.!
Published on: Tue Nov 3, 2026 6:24AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం (నవంబర్ 8) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3 వేల186 వార్డులకు ఆదివారం (నవంబర్ 1) పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఇందులో కార్పొరేషన్లలో 804, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో 2 వేల 382 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 96 లక్షల 89 వేల 061 మంది ఓటర్లకు గాను 60 లక్షల22 వేల 411 మంది అంటే దాదాపు 62 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. మొత్తం 556 కౌంటింగ్ హాళ్లు, 6 వేల 831 టేబుళ్లను ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపునకు 47 వేల 817 మందిని నియమించింది. అత్యధికంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు.
ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య పోరు నెలకొంది. మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొత్త చట్టం ప్రకారం మేయర్లు, ఛైర్‌పర్సన్‌లకు ప్రత్యక్ష ఎన్నిక జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. మేయర్, ఛైర్‌పర్సన్ పదవులకు 520 మంది, వార్డులు, డివిజన్ స్థానాలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. కొన్నిచోట్ల ఫిర్యాదుల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
[Ap Municipal Elections, Vote Counting, Results, State Election Commission, Arrangements, Telugu One]


