TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మునిసిపోల్స్: అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎస్ఈసీ.!

Published on: Sat Oct 31, 2026 9:09AM

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్    అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల కసరత్తులను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేసేలా పోలీస్ యంత్రాంగం,  జిల్లా యంత్రాంగం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన భద్రతా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రశాంతతను కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్‌ఈసీ అధికారులను అప్రమత్తం చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణతో ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించేందుకు యంత్రాంగం సర్వసద్ధంగా ఉంది.


[AP Municipal Elections, SEC Anil Chandra Punetha, Municipal Polling Directives, Andhra Pradesh State Election Commission, Webcasting, Polling Stations, Telugu One]