ఏపీ స్థానిక సమరం: వైసీపీకి దిమ్మతిరిగే పరిణామాలు.. ఎనిమిది మునిసిపాలిటీలు ఏకగ్రీవం.?
Published on: Mon Oct 19, 2026 10:55AM

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం, రాజకీయ విశ్లేషణల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 8 మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహాలు ప్రతివ్యూహాలు తార స్థాయికి చేరిన తరుణంలో, కొన్ని ప్రత్యేక స్థానాల్లో పోటీ లేకుండానే చైర్పర్సన్ పీఠాలు దక్కించుకునేందుకు పావులు కదులుతున్నాయి. ఈ ఏకగ్రీవాలన్నీ అధికార తెలుగుదేశం కూటమికి అనుకూలంగానే జరగడం గమనార్హం. ప్రతి స్థానంలోనూ గట్టిపోటీ ఇస్తాం.. ఏకగ్రీవాలకు అవకాశం ఈయం అంటూ వైసీపీ అధినేత జగన్ పదేపదే ప్రకటించడమే కాకుండా.. ఏకగ్రీవాలను అవకాశం ఇస్తే.. ఆయా నియోజకవర్గాల ఇన్ చార్జీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు ఉండవు అని హెచ్చరించిన తరువాత కూడా ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగడం వైసీపీ దయనీయ పరిస్థితిని అద్దంపడుతోందంటున్నారు విశ్లేషకులు.

ఈ ఏకగ్రీవాల అంశంపై అటు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం క్షేత్రస్థాయిలో తమ పట్టును నిలుపుకునేందుకు చివరి నిమిషం వరకు గట్టి ప్రయత్నాలు చేశాయి. ఇప్పటికే జమ్మలమడుగు, రాయచోటి మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, పుంగనూరు సహా మరో ఐదు నియోజకవర్గాలు కూడా అదే దారిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
[AP Municipal Elections, Andhrapradesh, Unanimous,Eight Municipalities, Andhra Pradesh News, Telugu One]


