TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల సమయంలోనూ విపత్తులు ఎదుర్కోవడంపైనే దృష్టి: చంద్రబాబు.!

Published on: Tue Nov 3, 2026 3:41PM

స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ తుపాన్లను ఎదుర్కొని సాధ్యమైనంత తక్కవ నష్టంలో రాష్ట్రాన్ని బయటపడేయడంపైనే దృష్టి పెట్టామని ఆంధ్రప్రదేశ్   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.

తాము చేసిన సేవ, రాష్ట్ర ప్రగతి కోసం పడిన శ్రమకు గుర్తింపుగా  ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని చంద్రబాబు అన్నారు.  సుపరిపాలన, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

తమ పరిపాలనకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మద్దతు ప్రభుత్వానికి అదనపు శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల కంటే ప్రజల ఇబ్బందుల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 

[AP Local Body Elections, CBN, Cylones, Politics, People Welfare, Telugu One]