TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం సొమ్ముతో విదేశాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం.!

Published on: Tue Aug 25, 2026 12:23PM

ఏపీ మద్యం కుంభకోణంలో   రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జగన్ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో  అక్రమాల పరిధి   మద్యం అమ్మకాలు లేదా రవాణా కాంట్రాక్టులకే పరిమితం కాలేదనీ, , విదేశీ పెట్టుబడుల వరకు వ్యాపించిందన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  వైసీపీ  హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన  కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎ ఈడీ అధికారులు  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.    

ఈ నేపథ్యంలో  మద్యం కుంభకోణం నిధుల మళ్లింపుపై మంత్రి కొలుసు పార్థసారథి  సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన కొలుసు పార్థసారథి ఆరోపణలు  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్  హయాంలో సుమారు  3 వేల500 కోట్ల రూపాయల  మద్యం కుంభకోణం.. . మద్యం తయారీ విధానం, డిపోల నుంచి షాపులకు రవాణా కాంట్రాక్టులు, చివరకు కవర్లు, హోలోగ్రామ్‌ల కేటాయింపు వరకు అన్ని విభాగాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

ఇలా  అక్రమ మార్గంలో ఆర్జించిన వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని హవా మార్గాల ద్వారా విదేశాలకు మళ్లించారనీ, అలా విదేశాలకు చేరిన సొమ్ముని  అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మైనింగ్ రంగాల్లో  పెట్టుబడులుగా పెట్టారని కొలుసు ఆరోపించారు.   రాష్ట్ర   ఖజానాకు గండి కొట్టి సేకరించిన సొమ్ముతో విదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించారన్నారు.

రవాణా ఛార్జీల విషయంలోనూ విపరీతమైన అక్రమాలు జరిగాయని, గతంలో కిలోమీటరుకు   13 రూపాయలుగా ఉన్న రవాణా వ్యయాన్ని   35 రూపాయలకు పెంచి రవాణా లోనే దాదాపు  400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.  దర్యాప్తు సంస్థల వద్ద పక్కా ఆధారాలు ఉండటం వల్లే  మాజీ మంత్రికి కోర్టులో ఉపశమనం దక్కలేదన్నారు.  ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించిన  కీలక సమాచారం,  అందించిన పత్రాల ఆధారంగానే దర్యాప్తు సంస్థలు కారుమూరిని అరెస్టు చేశాయన్నారు.    

AP Liquor Scam Funds Incested in  Real Estate Overseas, Karumuri Nageswara Rao Arrest, Kolusu Parthasarathy Charges, AP Liquor Scam Case Details