TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కామ్: రజిత్ భార్గవ్ వాంగ్మూలం.. వణికిపోతున్న నాటి ప్రభుత్వ పెద్దలు.!

Published on: Fri Oct 16, 2026 9:13AM

 వైసిపి హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో రోజుకో కీలక అంశం బయటకు వస్తోంది. పూటకో సంచలనం నమోదౌతోంది.  నాడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్   తాజాగా  విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట సెక్షన్ 164 కింద  వాంగ్మూలం ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత.. ఆయన ఇచ్చిన ఈ వాంగ్మూలంలో  ఈ వ్యవహారం అవకతవకలు, అక్రమాలను వెల్లడించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో నాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తతంగం మొత్తం జరిగిందని.. ఆ కుట్ర వల్ల  వేల కోట్ల అక్రమాలు జరిగాయని విచారణలో వెల్లడించిన రజిత్ భార్గవ్ అదే విషయాన్ని వాంగ్మూలంలోనూ పేర్కొన్నారు. ఇప్పుడు రజిత్ భార్గవ్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. 

రిజత్ భార్గవ్ వాంగ్మూలం మేరకు..   మద్యం సరఫరా.. బ్రాండ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ఇదంతా కూడా సీఎంఓ ఆధ్వర్యంలో జరిగింది.  వీటిని నాడు రజత్ గుర్తించారు. అంతేకాదు పాపులర్ బ్రాండ్లను పక్కనపెట్టి.. డిమాండ్ అసలు లేని.. నకిలీ.. స్థానిక బ్రాండ్లకు అడ్డగోలుగా ఇండెంట్లు పెట్టడాన్ని రజిత్ భార్గవ్ అభ్యంతరం చెప్పారు.

నాడు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డికి.. ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ కు రజిత్ భార్గవ్ మెమోలు జారీ చేశారు. అయితే నాడు రజత్ ఇచ్చిన మెమోలను వెనక్కి తీసుకోవాలని.. వాసుదేవరెడ్డి.. సత్య ప్రసాద్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రజత్ కు ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలను నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో  ముఖ్య కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి.. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి జారీ చేశారు. ఆ తర్వాత మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ లెవెల్ లో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రజత్  అప్పట్లో ఏం చేయలేక చేతులెత్తేశారు. ఆయన తాజాగా  ఈ  ఈ విషయాలను రజత్ ఆధారాలతో సహా విచారణ అధికారుల ముందు పెట్టారు. 

రజత్ దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో  అప్పట్లో ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాలు జరిగాయి.   ఎక్సైజ్ స్పెషల్ సిఎస్ పరిధిలో ఉండే ఆర్డర్ ఫర్ సేల్ అధికారాలను ఆయన నుంచి రాత్రికి రాత్రే తొలగించారు.  మాన్యువల్ విధానంలో ప్రసిద్ధ బ్రాండ్ల ఇండెంట్లు మార్చేశారు. కమిషన్లు మాత్రమే ఇచ్చే కంపెనీలకు ఆర్డర్లు వెళ్లే విధంగా మొత్తం కథ నడిపారు.  ఈ వ్యవహారాలను సీఎం సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు రజిత్ భార్గవ్ చెప్పినప్పటికీ, .  వాటిని మినిట్స్ దాకా చేరకుండా ధనుంజయ రెడ్డి తొక్కిపెట్టారని ఈడీ విచారణలో రజిత్ భార్గవ్ విస్పష్టంగా చెప్పారు.  ఈ నేపథ్యంలో జగన్ హయాంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయల్లో వణుకు మొదలైంది.  ముందు ముందు ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయనీ, కీలక అరెస్టులు జరిగే అవకాశాలున్నాయనీ అంటున్నారు. 


[AP Liquor Scam ED Inestigaion, , Rajat Bhargava, ED notices, Statement, Magestrate, Andhra Pradesh Liquor Scandal, YCP Piquor Policy, Telugu One]