TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఐటీ అధికారులు..!

Published on: Thu Aug 27, 2026 2:32PM

 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కుంభకోణంలో అక్రమంగా సమీకరించిన సొమ్ము మూలాలు, నిధుల మళ్లింపు వ్యవహారంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా మనీ ట్రయల్‌పై ఆరా తీస్తున్న అధికారులు.. ఈ వ్యవహారంలో సిట్‌, ఈడీ దర్యాప్తు అధికారులతో కీలక వివరాలను సేకరిస్తున్నారు.హైదరాబాద్‌లో సిట్‌, ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావే శమై.. ఇప్పటివరకు జరి గిన దర్యాప్తు, నిధుల లావాదేవీలకు సంబం ధించిన సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా భారీ మొత్తంలో నగదు మళ్లించి నట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలపై ఐటీ అధికా రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

కుంభకోణానికి సంబంధించిన నిధులు ఏఏ కంపెనీల ద్వారా మళ్లించారనే అంశంతో పాటు.. ఆ సొమ్ము చివరకు ఎక్కడికి చేరింది? ఎవరెవరి బ్యాంకు ఖాతా ల్లోకి వెళ్లింది? విదేశాలకు ఎంత మొత్తం తరలిం చారు? అనే కోణాల్లో ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యం గా దుబాయ్‌ సహా పలు దేశాలకు నిధులు తరలించినట్లు దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో.. విదేశీ లావాదేవీలపై కూడా ఐటీ శాఖ దృష్టి సారిం చింది. నిధులను విదేశాల కు, బినామీ సంస్థలకు ఎలా మళ్లించారు? ఏ మార్గాలను ఉపయోగిం చారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన వివరాలతో పాటు.. వారి ఆధీనంలో ఉన్నట్లు అనుమానిస్తున్న డొల్ల కంపెనీలు, వాటి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధిం చిన సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

కుంభకోణంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను కూడా సిట్‌, ఈడీ నుంచి తీసు కుంటున్నారు. ఇదిలా ఉండగా.. నిందితులకు చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన వివరాలను ఈడీ అధికారులు ఐటీ శాఖకు అందించినట్లు తెలుస్తోంది. ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, నగదు లావాదేవీలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

సిట్‌, ఈడీ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తులు, విదేశీ నిధుల మళ్లింపు వంటి అంశాల్లో తదుపరి చర్యలకు ఐటీ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం...మొత్తం గా ఏపీ మద్యం కుంభకోణం లో అక్రమంగా సమీకరిం చిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి మళ్లింది? ఎవరెవరి ద్వారా లావాదేవీలు జరిగాయి? అన్న అంశాలపై ఐటీ దర్యాప్తు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

AP liquor scam case, SIT, ED, IT officers, Income Tax Department, Shell Companies, Money Laundering, CM Chandrababu, Naralokesh, TDP