TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదవి కాదు, పని అడిగాను: చంద్రబాబు ఇవ్వలేదు: ఏబీవీ సంచలన వ్యాఖ్యలు.!

Published on: Tue Oct 6, 2026 12:32PM

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  విమర్శలు  గుప్పించారు. ఇక తాను పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, ఆయన పాలనలో చోటుచేసుకున్నట్లు తాను భావిస్తున్న తప్పులను చట్టపరంగా ప్రశ్నించడం తన లక్ష్యాలన్నారు. 

రిటైర్మెంట్ తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనీ, అయితే తనకు పదవులపై కించిత్ కూడా ఆసక్తి లేదని చెప్పారు.  తనకు పని ఇవ్వమనీ, నిర్దుష్ట బాధ్యత అప్పగించాలనీ తాను చంద్రబాబును కోరినట్లు చెప్పారు. జగన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబును తాను కోరాననీ, అయితే ఆయన తనకు ఎటువంటి  పనీ అప్పగించలేదని స్పష్టం చేశారు.  జగన్ హయాంలో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అవకతవకలు, తప్పిదాలను చట్టపరంగా ప్రశ్నించే పని అప్పగించాలని చంద్రబాబును కోరాననీ, అయితే ఆయన పట్టించుకోలేదని వివరించారు.   ప్రభుత్వం నుంచి తాను ఆశించిన బాధ్యత రాకపోవడంతో బయట ఉండి తనకు సాధ్యమైన మార్గాల్లో అదే అంశాలపై పోరాడుతున్నానన్నారు.

ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అయితే తన ఎంట్రీ పట్ల తెలుగుదేశం అధినాయత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.  


[AP Inteligence, Former Chief,  AB Venkateswara Rao, CBN, Jagan, Appolitics,  Former IPS, Telugu One]