TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు: యథావిధిగా పులివెందుల ఓట్ల లెక్కింపు.!

Published on: Tue Nov 3, 2026 7:29AM

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ  రీపోలింగ్నిర్వహించాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం బుధవారం (నంబర్ 3) ఉదయం ఏడున్నరకు కీలక తీర్పు వెలువరించింది.

 మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై మంగళవారం (నవంబర్ 2)విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తీర్పు ఈ ఉదయం ఏడున్నరకు రిజర్వ చేసిన సంగతి విదితమే.  ఆ మేరకు బుధవారం (నవంబర్ 2) ఉదయమే తీర్పు వెలువరించింది. 

వైసీపీ నేతల పిటిషన్ డిస్మిస్ చేసింది. పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిందని, ఏజెంట్లను అనుమతించలేదని, రీపోలింగ్ నిర్వహించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న న్యాయస్థానం, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. వైసీపీ నేతలు దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ డిస్మిస్ చేసింది,  దీంతో పులివెందుల మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ యధావిదిగా జరగనుంది.  

[AP High Court Dismiss YCP Petitions, Puluvendula Municipal Election, Repoling, Halt, Counting, Telugu One]