TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్: రీచ్, వ్యూస్ ను బట్టి డబ్బులే డబ్బులు.!

Published on: Thu Sep 24, 2026 7:28AM

సోషల్ మీడియా అనేది ఓ కాలక్షేపం వ్యవహారం అనుకుంటారు చాలా మంది. అయితే.. ఇంకెంత మాత్రం అది కాలక్షేపం వ్యవహారం కాదు. కాసులు కురిపించే కామధేను. సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేర్చే వారధి. వేదిక.  సోషల్ మీడియా ప్రధాన్యత ఇంతా అంతా కాదు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు చంద్రబాబు సర్కార్ ఓ బంపరాఫర్ ఇచ్చింది.  

రాష్ట్రంలో  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమ వేదికగా  పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు.. వంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా ఏపీ సర్కార్ గుర్తించింది. అందుకే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.  అందుకోసం సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్ల ఎం ప్యానెల్మెంట్ పాలసీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక నుంచి సామాజిక మాధ్యమంలో   ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై  కంటెంట్ రూపొందించే వారికి అధికారికంగా గుర్తింపు ఇచ్చి,   వాటికి లభించే రీచ్, వ్యూస్  ఆధారంగా నగదు ప్రోత్సాహకాలుఇవ్వనుంది. ఈ పాలసీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వివిధ కేటగిరీలుగా   విభజించి అందుకు అనుగుణంగా పారితోషకాలు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. 

పదివేల నుంచి 24 వేల 999 మంది ఫాలోవర్లో ఉన్న వారికి 2500,  పాతిక వేల నుంచి 49 వేల 999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి ఐదు వేలు, అలాగే  50 వేల నుంచి 99 వేల 999 మంది వరకూ ఫాలోవర్లు ఉన్నవారికి 7 వేల 500 రూపాయల వరకూ వరకు పారితోషికం ఇస్తుంది.ఇక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి 15 వేల రూపాయల వరకూ నగదు ప్రోత్సాహకం అందిస్తుంది.  

ఇలా గుర్తింపు పొందాలంటే.. ప్రభుత్వం నిర్దేశించిన  ప్రమాణాలకు అనుగుణంగా కంటెంట్ ఉండాలి.  ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. కేవలం ఫాలోవర్స్ సంఖ్యను మాత్రమే ప్రభుత్వం ఆధారంగా తీసుకోదు. కంటెంట్, లభిస్తున్న వ్యూస్, రీచ్, క్రెడిబులిటీలను కూడా ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంటుంది. 

 ఇందుకోసం, అంటే ఇన్ ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్మెంట్ కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అర్హత ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి.. వారిని కేటగరీల వారీగా విభజించి ఐడీ కార్డులు జారీ చేస్తుంది.   

అంటే ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం టీవీ, పత్రికలకు.. అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు ప్రకటనలు ఇచ్చేది. ఇకపై   యూట్యూబ్ చానల్స్.. ఫేస్ బుక్,  ఇంస్టాగ్రామ్ పేజీలకూ ఆ అవకాశం లభిస్తుంది.   యువత సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఏపీ సర్కార్  ఇన్ ఫ్లూయెన్సర్ల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. 

[AP Government Bumper Offer, Social Media Influencers, Incentives, Reach, Views, Government programmes, Welfare Schemes, Content]