సమస్యల పరిష్కారం కోసమా.. రాజకీయం కోసమా.. బొప్పరాజు తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం.!
Published on: Mon Sep 7, 2026 9:24AM

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకుల తీరు, వారు అనుసరిస్తున్న వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో వేర్వేరు సందర్భాల్లో ఉద్యోగ సంఘాల నేతలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడం, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం వంటి వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమకు రావాల్సిన బకాయిలు మరియు ఆర్థిక చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనలు అధికార వర్గాల్లో తీవ్ర కలకలాం రేపుతున్నాయి.
వారి వ్యూహాలు, ఎత్తుగడలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా వారి విమర్శలు ఉండటం వెనుక రాజకీయం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, వీధి పోరాటాలకు దిగడం ఉద్యోగుల ప్రయోజనాలకే భంగం కలిగించేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. . ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా.. విమర్శలు, ఆరోపణల వెనుక బొప్పరాజు స్వార్థ రాజకీయం ఉందని ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు.
.webp)
ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మరీ ముఖ్యంగా బొప్పరాజు డిమాండ్ చేస్తున్నది గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల గురించే కావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను విడదల వారీగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. బొప్పరాజు వంటి వారు చేస్తున్న హంగామా విమర్శల పాలౌతోంది. చర్చలతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అనవసర రాద్ధాంతం చేయడం వెనుక ఉన్నది దురుద్దేశమేనని అంటున్నారు.
[AP Employees Angry On Bopparaju, Ap Employees Unions, Chandrababu Naidu, Bopparaju Venkateswarlu, AP Government Dues, Andhra Pradesh, Telugu One]


