టీడీపీకి వెన్నుపోటు పొడవడం అలవాటే... మోదీ దయతో చంద్రబాబు..


టీడీపీ-బీజేపీ పార్టీలు విడిపోవడం ఖాయమని ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క బీజేపీ పెద్దలు టీడీపీపై ఎలాంటి విమర్శలకు పాల్పడవద్దు అని చెబుతున్నా.. మరోపక్క ఆ పార్టీ నేతలు మాత్రం రెచ్చిపోయి విమర్సలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో  ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కో ఆర్డినేటర్ రఘురాం చేరారు. ఓ ఛానలో లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టీడీపీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా బీజేపీకి వెన్ను పోటు పొడుస్తుందన్న విషయం తమకు తెలుసని...వెన్నుపోటు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు అనుభవిస్తున్న కేంద్ర మంత్రి పదవులకు వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, వారికసలు సిగ్గేలేదని వ్యాఖ్యానించారు. ఏపీని బీజేపీ ఎంతగానో ఆదుకుందని, అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ల పాటు కనిపించిన బీజేపీ నిధులు, ఇప్పుడు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు ఎంపీలయితే, వారి వ్యక్తిగత ప్రయోజనాలే చూసుకుంటారని వ్యాఖ్యానించిన రఘురాం, వాజ్ పేయి దయతో ఒకసారి, మోదీ దయతో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ విషయాన్ని ఇప్పుడాయన మరచి పోయారని విమర్శించారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...