అర్నాబ్ తుపాను: అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన సరుకురవాణా నౌక.!
Published on: Wed Oct 28, 2026 4:34PM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అర్నాబ్ పెను తుపాను వణికించేసింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో రాకాసి అలలు బెంబేలెత్తించాయి. పెను గాలులు విలయం సృష్టించాయి. ఈ ప్రతికూల వాతావరణం వేళ డోలాయమానంలో పడిన ఒక భారీ సరుకు రవాణా కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీర సమీపంలో నిలిచిపోయింది. సముద్రంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు, ప్రచండ ఈదురుగాలుల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నం నౌకాశ్రయం నుంచి భారీ ప్రమాణంలో సల్ఫర్తో బయలుదేరిన ఈ నౌక లో సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ ఆగిపోయినట్లుగా తెలుసతోంది. దీనికితోడు అర్నాబ్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడం, ఉధృతమైన అలలు ఎగసిపడటంతో సముద్రంలో దారి తప్పిన ఈ నౌక మెల్లగా అంతర్వేది తీరం వైపు కొట్టుకొచ్చి అక్కడ చిక్కుకుపోయింది.
ఈ విపత్కర పరిస్థితిపై సమాచారం అందుకున్న వెంటనే విశాఖ పోర్టు ట్రస్ట్, భారత కోస్ట్ గార్డ్, సముద్ర భద్రతా దళాల అధికారులు నౌక ఉన్న ప్రస్తుత భౌగోళిక స్థానాన్ని వాతావరణ పరిస్థితులను రేడార్ వ్యవస్థల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే, తుపాను ధాటికి రాకాసి అలలు నిరంతరం ఎగసిపడుతుండటంతో నౌక దగ్గరకు టగ్ బోట్లను పంపడం లేదా సహాయక చర్యలను నేరుగా అందించడంలో అంతరాయం ఏర్పడింది. నౌకలో ఉన్న సిబ్బంది క్షేమ సమాచారం పై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక సహాయక నౌకలతో సిద్ధంగా ఉన్నారు. వాతావరణ ఒకింత సానుకూలంగా మారగానే, ముందు నౌకలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
[Antarvedi Ship Stranded, Cyclone Arnab Impact AP, Vizag Cargo Ship, Konaseema, TeluguOne]


