TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నామలై రాజీనామా ఆమోదం

Published on: Fri Jun 5, 2026 12:58PM

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను అన్నామలై తన రాజీనామా లేఖ అందజేశారు. అంతకు ముందు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అన్నామలై తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును అన్నామలై వ్యతిరేకించారు.

దీంతో ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఆయనను పార్టీలోనే కొనసాగేలా బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బీజేపీ హై కమాండ్ అన్నామలై రాజీనామాను శుక్రవారం (జూన్ 5) ఆమోదించింది.   అన్నామలై తమిళ్‌ ఫస్ట్ అనే నినాదంతో ఓ సరికొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబున్నాయి.