TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నా హజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

Published on: Tue Sep 1, 2026 9:00AM

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, గాంధేయ వాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని బాంబే ఆసుపత్రికి తరలించారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ప్రస్తుతం అన్నా హజారే ఐసీయూలో వైచికిత్స పొందుతున్నారు.  హజారే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

 వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, డీహైడ్రేషన్‌ సమస్యలతో ఆయన తొలుత స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు.   డాక్టర్‌ గౌతమ్‌ భన్సాలీ పర్యవేక్షణలో హజారేకు చికిత్స జరుగుతోంది.  

హజారే ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త బులిటిన్ విడుదల చేయాల్సి ఉంది. 

  మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జల సంరక్షణ, అటవీ అభివృద్ధి, గ్రామీణ స్వావలంబన, మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలతో ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. 

సమాచార హక్కు చట్టం, జనలోక్‌పాల్‌ బిల్లు లు రావడానికి అన్నా హజారే చేపట్టిన ఉద్యమాలే కారణం.  1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను  పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది.  ఇటీవల విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని హజారే డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని  ఆయన   తప్పుబట్టారు. ప్రజా సమస్యలను హింసతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు.

anna hazare hospitalised,  Mumbay, Infection, Icu, Lokpal, Right to Information, Act, Relegaosiddi