ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన: అప్రమత్తమైన అధికార యంత్రాంగం.!
Published on: Tue Sep 29, 2026 12:03PM

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లాయి. నదులు వరదతో ఉప్పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
.webp)
మొత్తంగా భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. హమ్మయ్య పరిస్థితులు కుదుటపడుతున్నాయి అనుకునేలోగా వాతావరణ శాఖ మరో సారి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీంతో విపత్తుల సంస్థ అప్రమత్తమైంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాటుకు అవకాశాలున్నందున, ఎవరూ బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించింది. అలాగే, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
[Andhra Pradesh Weather, AP Rain Alert, Disaster Management, Rayalaseema Rains, AP Weather Forecast, Parwatipuram Manyam, Anakapalle, Telugu One]


