TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: అప్రమత్తమైన అధికార యంత్రాంగం.!

Published on: Tue Oct 13, 2026 5:54PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న మూడు రోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ సూచన మేరకు  ఉపరితల ఆవర్తనం   ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా  ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.  కొన్ని ప్రాంతాల్లో  ఈదురుగాలులు, పిడుగుపాటుకు అవకాశాలున్నాయని హెచ్చరించింది.  ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

ర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు,  రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడవద్దని హెచ్చరించింది.  వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, కోత కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.

రాబోయే మూడు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను కోరింది.వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.   అత్యవసర సహాయక చర్యల కోసం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో  కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేసింది.  

[Andhra Pradesh Rain Forecast, AP Weather Alert, Heavy Rains, Three Days, IMD Rain Warning Telugu News, Telugu One]