ముగ్ధుడినైపోయా: గంగవరం బీచ్ సౌందర్యంపై ఆనంద్ మహీంద్రా పోస్టు.. నెటిజనులు ఫిదా.!
Published on: Mon Oct 26, 2026 10:07AM

గంగవరం బీచ్ పై దిగ్గజ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామిజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఏపీలోని తీర ప్రాంత ప్రకృతి సౌందర్యానికి తన్మయుడై గంగవరం పోర్టు విషయంలో చేసిన పోస్టు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

విశాఖ సమీపంలోని గంగవరం బీచ్‌కి సంబంధించిన ఒక అందమైన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అలల తాకిడి, సూర్యాస్తమయ వేళల్లో ప్రకృతి వర్ణాల కలయికతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ సముద్రతీర సౌందర్యం తనను ముగ్ధుడిని చేసిందని పేర్కొన్న ఆయన దేశంలో చూడదగ్గ అద్భుత ప్రదేశాలలో గంగవరం బీచ్ ఒకటని పేర్కొన్నారు.
దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఇటువంటి గంగవరం బీచ్ వంటివి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆనంద్ మహీంద్రా పోస్టు.. విశాఖ పర్యాటక రంగానికి గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Anand Mahindra Post On Gangavaram Beach, Visakhapatnam Tourism, Anand Mahindra X post,Netizens, Fidaa, Telugu One]


