TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్ షా హైదరాబాద్ పర్యటన: భారీ పాదయాత్ర పూర్తి షెడ్యూల్ ఇదే.!

Published on: Sat Oct 31, 2026 8:58PM

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా, అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల మధ్య రిజర్వ్‌డ్ టైమ్‌లో భాగంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.   మధ్యాహ్నం సరిగ్గా 4:00 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు అమిత్ షా ప్రతిష్టాత్మక మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని "రక్షించడమే ధ్యేయంగా సాగే ఈ భారీ పాదయాత్రలో వేలాదిగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మేధావులు, జాతీయవాదులు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. నిజాం కాలేజ్ నుంచి బయలుదేరే ఈ పాదయాత్ర రద్దీగా ఉండే ప్రధాన వీధుల మీదుగా సాగి మొజాంజాహి  మార్కెట్ వరకు కొనసాగుతుంది. పాదయాత్ర ముగిసిన అనంతరం సాయంత్రం 5:00 గంటల నుంచి 5:30 గంటల వరకు మొజాంజాహి  మార్కెట్ వద్ద జరిగే భారీ కార్నర్ మీటింగ్ (ప్రజా బహిరంగ సభ)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ భవిష్యత్తు కార్యాచరణను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, బీజేపీ క్యాడర్‌లో జోరు పెరిగింది.   

 

 

 

[ Amit Shah Hyderabad visit, Amit Shah padayatra, Telangana BJP news, Amit Shah schedule November 2, Begumpet airport, Mozamjahi Chowrasta rally, Kishan reddy, N. Ramachandra Rao, Bandi sanjay kumar ]