అర్నాబ్ నష్టం అంచనాకు త్వరలో ఏపీకి కేంద్ర బృందం: చంద్రబాబుకు అమిత్ షా హామీ.!
Published on: Thu Oct 29, 2026 4:12PM
.webp)
దేశవ్యాప్తంగా తీర ప్రాంతాలను వణికిస్తున్న అర్నబ్ తుపాను ముప్పు మరియు దాని అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన టెలిఫోన్ లొ మాట్లాడారు.
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అమిత్ షా, రాష్ట్రంలో తుపాను సృష్టించిన బీభత్సం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు దెబ్బతినడం, రోడ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వివరించిన చంద్రబాబు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం కోరారు.

తుపాను కారణంగా సంభవించిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు వీలుగా త్వరలోనే కేంద్ర బృందాన్ని బాధిత రాష్ట్రాలకు పంపనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఆ బృందం నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం అందజేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.
[Amit Shah Cyclone Arnab Review, Cyclone Arnab Affected States CMs, Central Teams, Estimate Cyclone Damage, AP Cyclone Relief, CBN, Amit Shah, National Disaster, Telugu One]


