రాబోయే కాలంలో కాబోయే హోంమంత్రిని: అంబటి ప్రకటన.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజనులు.!
Published on: Mon Oct 19, 2026 12:02PM

జగన్ హయాంలో ఆయన కేబినెట్ లో పని చేసిన మంత్రులందరూ పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి వినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ పరాజయం వారు ఐదేళ్ల పాటు అందించిన పాలనా తీరుకు అద్దంపుడుతుందనడంలో సందేహం లేదు. జగన్ కేబినెట్ లో అంబటి రాంబాబు ఒకరు. జగన్ హయాంలో అంబటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ పదవిలో ఉన్నప్పుడు, కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి కనీస సమాచారం కూడా చెప్పలేకపోయారంటే, అప్పటి పాలన తీరు, అంబటి వ్యవహారశైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధమౌతుంది. అంబటి అప్పట్లో తన శాఖకు సంబంధించి విషయపరిజ్ణానంలేకపోవడం ద్వారానే కాదు.. నిరంతరం చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ని దూషించడం ద్వారా కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అపఖ్యాతి పాలయ్యారు. పాలయ్యారు. ఇది స్వయంగా ఆయనకే కాదు.. వైసీపీకి కూడా తీరని నష్టాన్ని చేకూర్చి పెట్టింది.
అటువంటి అంబటి ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక తాను హోం మంత్రిగా ఉంటానని బాహాటంగా ప్రకటించారు. ఆయన ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇరిగేషన్ మంత్రిగా పోలవరం ప్రాజెక్టు ఏమిటో నాకు అర్ధం కాదని బాహాటంగా చెప్పిన ఆయన ఇప్పుడు.. 2029 ఎన్నికలలో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయితే.. తాను హోంమంత్రిని అవుతానంటూ చేసిన ప్రకటన అంబటి అవగాహనారాహిత్యానికి, రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆయన రాజకీయ అపరిపక్వత, అవగాహనా రాహిత్యాన్ని పక్కన పెడితే.. అంబటి తనను తాను కాబోయే హోంమంత్రిగా ప్రకటించుకోవడం వైసీపీకి స్థానిక ఎన్నికల వేళ ప్రతికూలతకు కారణమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇరిగేషన్ మంత్రిగా వెలగబెట్టింది చాలకనా, నిత్యం దూషణల పర్వంతో చెలరేగిపోయే అంబటి ఇప్పుడు పోలీసు మంత్రిని అవుతానంటూ చెప్పుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. కానీ అంబటి రాంబాబు వంటి వారు, తాము మళ్లీ హోం మంత్రి పదవిలోకి వస్తానంటూ ప్రకటించుకోవడం పార్టీకి ప్రతికూలంగా మారడం తథ్యమని నెటిజనులు అంటున్నారు. పైగా అంబటి రాంబాబు ప్రకటన ఆయనలో ఉన్న అధికార దాహాన్ని బయటపెట్టిందని చెబుతున్నారు.
[Ambati Rambabu Home Minister Comments, YCP, Andhra Pradesh Politics, Local Body, Elections, dverse, Conditions, Telugu One]


