TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబటి.. మేకపోతు గాంభీర్యమేనా?

Published on: Tue Sep 22, 2026 11:06AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి   అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మద్యం రవాణా టెండర్లు, సబ్‌కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఆయనను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్నది. 

ఈడీ నోటీసులపై అంబటి రాంబాబు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత తనకు అసలు ఈడీ నోటీసులే అందలేదన్న ఆయన.. ఆ తరువాత ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ విమర్శలు గుప్పించారు. ఇటువంటి వాటికి తాను బెదరనని గంభీరంగా ప్రకటనలు చేశారు. తాను ఈడీ విచారణకు హాజరౌతాను కానీ, ప్రస్తుతం తన ఆరోగ్యం బాలేదనీ, ఆరోగ్యం కుదుటపడిన తరువాతనే ఈడీ విచారణకు వెడతానని చెబుతున్నారు.   మద్యం కుంభకోణం కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి.. మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టర్లతో ఆయనకు ఉన్న సంబంధాలలే కారణమంటున్నారు.   

అయితే అంబటి మాత్రం ఈడీ నోటీసులపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్‌ల రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని ఈరోపాస్లున్నీరు.  అయితే అంబటి రాజకీయ కక్ష సాధింపు అంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన వ్యక్తిగత వాదనగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఎందు కంటే ఈడీ అంబటికి నోటీసులు ఇచ్చినది మద్యం రవాణా కేసు దర్యాప్తులో భాగంగానే అని చెబుతున్నది. ఇప్పటికే ఈకేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు 

ఇక ఈ కేసుకు సంబంధించి అంబటి పాత్రపై దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పక్కా ఆధారాలను సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం.  అంబటి బినామీలుగా ప్రచారంలో ఉన్న సుబ్బారెడ్డి, పురుషోత్తం అనే వ్యక్తులకు అంబటి   మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్టులు కట్టబెట్టారని ఈడీ పేర్కొంటోంది. ఆ కాంట్రాక్టర్ల వద్ద నుంచి భారీ ఎత్తున కమిషన్లు, నిధులు దండుకున్నట్లువిచారణలో సుబ్బారెడ్డి, పురుషోత్తం అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా,  డబ్బులు ఎలా మార్పిడి జరిగాయో ఆధారాలతో సహా వివరించినట్లు చెబుతున్నారు.

మొత్తం మీద ఈ కేసులో అంబటి నిండా మునిగినట్లేనని అంటున్నారు. అందుకే భయం లేదంటూనే.. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకూ కారుమూరిలా అరెస్టు తప్పదన్న ఉద్దేశంతోనే ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో జంకుతున్నారనీ, ఆరోగ్య కారణాలతో విచారణను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనీ వైసీపీయులే అంటున్నారు. మొత్తం మీద అంబటి మద్యం కుంభకోణం కేసులో ఇబ్బందులు ఎదర్కోకతప్పదని అంటున్నారు. 

[Ambati Rambabu, ED Notices, AP Liquor Scam, ED Investigation, Liquor Transportation Scam, YCP,  Karumuri Nageswara Rao, Telugu One]