Air Pollution: సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.!
Published on: Sat Oct 24, 2026 12:53PM
.webp)
మనిషికి ప్రాణాధారం గాలి. అటువంటి గాలి విషపూరితమైతే.. మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో పెరిగి.. మనిషి జీవన్మరణ సమస్యలతో సమతమమౌతున్నాడు. ప్రతి శ్వాసా ఆరోగ్యానికి ముప్పుగా మారుతూ.. మానవ జీవితాన్ని మరణంవైపు తరుముతున్న పరిస్థితి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో వాయు కాలుష్యానిదే సింహభాగం. వాయు కాలుష్యం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడంతో ఆగదు.. అది మనికి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా ప్రతి అవయవం పని తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సహా అనేక అవయవాలపై ప్రభావం చూపుతోంది.
హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్, యూనిసెఫ్ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2024 నివేదిక మేరకు 221లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య మరణాలు రమారమి 81 లక్షలు. వాయుకాలుష్య సంబంధిత మరణాలలో ఇండియా టాప్ లో ఉంది. భారత్ లో 2021లో వాయు కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 21 లక్షల పైచిలుకు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశమంటే.. వాయు కాలుష్యం అంటే.. నగరాలు, పట్టణాల్లో కనిపించే పొగమంచు మాత్రమే కాదు.. అది మనిషి ఆయుర్దాయాన్ని హరించేసే కాలకూట విషయం.
స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత కలుషితమైన టాప్ 20 నగరాలలో 13 ఇండియాలోనే ఉన్నాయి. ఆ జాబితాలో టాప్ ప్లేస్ లో అసోంలోని బైర్నిహాట్ నిలిచింది. అక్కడ వాయు కాలుష్యం సగటున పీఎమ్ 2.5 స్థాయులో నమోదైంది. దేశ రాజధాని హస్తినలో కూడా వాయు కాలుష్యం ఆందఓళనకరస్థాయిలో ఉన్నప్పటికీ.. ఈ జాబితాలో టాప్ 20లో లేదు.

ఇక విషయానికి వస్తే.. పీఎమ్ 2.5 అంటే అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు. ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెడతాయి. కొన్ని కణాలు రక్తప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే వీటి ముప్పు సాధారణ దుమ్ముతో పోలిస్తే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. అది పక్కన పెడితే కాలుష్య స్థాయులు కాలానుగుణంగా మారుతుంటాయి. ఒక సంవత్సరం జాబితాను ప్రస్తుత పరిస్థితికి యథాతథంగా అన్వయించడం సరికాదు. టాప్ 20 జాబితాలో లేనంత మాత్రాన ఆ జాబితాలో లేని నగరాలు పొల్యూషన్ ఫ్రీ నగరాలుగా భావించడానికి వీల్లేదు.
సాధారణంగా వాయు కాలుష్యం అనగానే మనకు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలు గుర్తుకొస్తాయి. ఆ నగరాల్లోనే వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని భావించడం కద్దు. కానీ అది కరెక్ట్ కాదు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో వాయు కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే స్థాయిలోనే ఉ:ది.
2024లో పార్లమెంటు వేదికగా వెల్లడించిన వివరాల మేరకు ఏపీలోని 13 నగరాలో వాయు కాలుష్య ప్రభావం తీవ్రాతి తీవ్రంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, కడప నగరాలు కాలుష్య ప్రభావితం అని పార్లమెంటు వేదికగా వెల్లడైంది.
విశాఖపట్నంలో పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు తదితర నగరాలు వాహనాల రద్దీ, నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ వైఫల్యం కారణంగా కాలుష్య కుహారాలుగా మారాయి.
గాలిలోకి విషం ఎలా చేరుతోంది?
ఇక గాలి కాలకూట విషంగా మరడానికి దారి తీస్తున్న కారణాలు ఏమిటని చూస్తే.. అదుపులేకుండా పెరిగిన వాహనాలు.. ఆ కారణంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం. ఈ కారణంగా వెలువడే ఉద్గారాలు అలాగే.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల కాలుష్యం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వంటివి వాయు కాలుష్యాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.
అతి సూక్ష్మ ధూళి, ఇతర కణాలు. ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్య సమస్యల తీవ్రం చేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా వాహనాలు, వాటిలో ఉపయోగించే ఇంధన ఇంధన దహనం కారణంగా వెలువడే పొగ, అలాగే.. పారిశ్రామిక ప్రక్రియలు, శిలాజ ఇంధనాల దహనం ఇంధనం పూర్తిగా మండనప్పుడు ఏర్పడే ప్రమాదకర వాయువు, ఇంకా సూర్యరశ్మి సమక్షంలో ఇతర కాలుష్య కారకాల మధ్య జరిగే రసాయన చర్యలు.. ఇవన్నీ వాయు కాలుష్యం ప్రమాదకరస్తాయికి చేరడానికి దోహదం చేస్తున్న కారణాలు.
వీటికి తోడు పొగాకు పొగ, బూజు, పుప్పొడి వంటి పదార్థాలు, పంట వ్యర్థాల దగ్ధం వల్ల వెలువడే వాయువు, అడవుల్లో కార్చిచ్చు, గృహాల్లో ఘన ఇంధనాల వినియోగం కూడా కాలుష్యానికి కారణమవుతాయి. వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల బాధ్యత, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా వ్యవస్థలు పూచీపడాలి.
అదెలాగంటే.. సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని ఇతోథికంగా పెంచడం, అదే సమయంలో చమురు వినియోగం నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం. ఇక ప్రజారవాణాను బలోపేతం చేయడం, అంటే.. మెట్రో, బస్సులు, రైలు సేవలను విస్తరించి మరింతగా జన బాహుల్యానికి వాటిని అందుబాటులోకి తీసుకురావాలి. సైకిల్ మార్గాలు, నడకకు అనువైన రహదారులను అభివృద్ధి చేయాలి. కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన నిరంతరాయంగా జరగాలి. అలాగే నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లుతున్న సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా, నిర్మాణ ధూళి, చెత్త దహనంపై నియంత్రణ విధించాలి. నిర్మాణ ప్రాంతాల్లో ధూళి వ్యాప్తిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. చెత్తను బహిరంగంగా కాల్చకుండా అందుకు శాస్త్రీయ విధానాన్ని అవలంబించాలి.
పంట వ్యర్థాలను కాల్చకుండా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు, సాంకేతికత, ఆర్థిక సహాయాన్ని రైతులకుఅందించాలి. వీటితో పాటు జనం కూడా ఎవరికి వారుగా వ్యక్తిగత స్థాయిలో కాలుష్య నివారణకు తమ వంతు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికి వారు తమ నివాసాలలో పొగ, ధూళి తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
ఒకప్పుడు తీవ్ర వాయు కాలుష్యంతో కూనారిల్లిన చైనా రాజధాని బీజింగ్.. ఇప్పుడు కాలుష్య నివారణ చర్యలతో కాలుష్య రహిత నగరంగా తలెత్తుకు నిలబడుతోంది. ఆ నగరంలో కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని ఇండియన్ సిటీస్ ముందుకు సాగాలి. బీజింగ్ లో కాలుష్య నియంత్రణకు వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలపై నియంత్రణలు, స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, నిరంతర పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే తాత్కాలిక చర్యలు కాదు శాస్త్రీయ ప్రణాళిక, దీర్ఘకాలిక ఆచరణ ముఖ్యమని బీజింగ్ అనుభవం చాటుతోంది.
కాలుష్యంపై చర్చ ఏటా ఒక్క సీజన్ కు మాత్రమే పరిమితమౌతోంది. ఆ తరువాత దానిపై చర్చ ఉండటం లేదు, కాలుష్య నివారణ చర్యలకు చెల్లు చీటీ పాడేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాలుష్య నివారణ అన్నది ఎప్పటికీ సాధ్యం కాని, సాధించలేని ప్రణాళికగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. స్వచ్ఛమైన గాలి అన్నది లగ్జరీ కాదు.. ప్రపంచంలో జీవించే ప్రతిమనిషి ప్రథమిక హక్కు. అభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రభుత్వాలు, వాటి విధానాలూ గాలిని కాలుకూట విషంగా మార్చడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు.
[Air Pollution Effect On Public Health, Health Problems, Air Pollution India, Andhra Pradesh, Visakhapatnam, Pollution Prevention, Telugu One]


