TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడిడాస్ లో ఉద్యోగాల కోత.!

Published on: Thu Sep 17, 2026 10:12AM

ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్  సంస్థ భారత్‌లో తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్‌లోని తన ప్రముఖ ఇండియా టెక్నాలజీ హబ్   కార్యాలయంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌ను ప్రకటించి కలకలం రేపింది.

సెప్టెంబర్ 15న నిర్వహించిన   టౌన్ హాల్ సమావేశంలో ఈ ఉద్యోగాల కోతకు సంబంధించిన నిర్ణయాన్ని యాజమాన్యం వెల్లడించింది. ఈ పరిణామంతో వందలాది మంది టెక్ నిపుణుల భవితవ్యం   ప్రశ్నార్థకంగా మారింది. 2021లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ గురుగ్రామ్ టెక్ హబ్‌లో మొత్తం దాదాపు 700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, తాజా పరిణామాల నేపథ్యంలో వారిలో సగం మంది అంటే.. 350 మందికి పైగా  ఉద్యోగులపై వేటు పడనున్నన్నది. అయితే, ఈ లేఆఫ్స్ ప్రభావం తమ ఇండియా టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లో కేవలం 20 శాతం కంటే తక్కువేనని అడిడాస్ అధికారికంగా పేర్కొన్నప్పటికీ, ఖచ్చితమైన ఉద్యోగుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.  

ఈ  నిర్ణయం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు,  డేటా ఇంజనీర్లు    ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. టౌన్ హాల్ సమావేశం ముగిసిన వెంటనే ప్రభావితమైన ఉద్యోగులను రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్‌నకు చెందిన ఉద్యోగులకు సెప్టెంబర్ 15వ తేదీనే నేరుగా ఎగ్జిట్ లెటర్స్ అందజేయగా, రెండవ గ్రూప్ ఉద్యోగులను  డిసెంబర్ 15 వరకు కంపెనీలో కొనసాగాలని స్పష్టం చేసింది. 

ఈ మధ్యకాలంలో వారు ఇతర టెక్ హబ్ సహోద్యోగులకు బాధ్యతల బదిలీ  పూర్తి చేయాలని, అలాగే ఈ మూడు నెలల వ్యవధిలో సంస్థలోనే వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా బయట కొత్త అవకాశాలను అన్వేషించడానికి డిసెంబర్ 15 వరకు డెడ్‌లైన్ విధించారు. ఒకవేళ డిసెంబర్ 15 నాటికి వేరే పొజిషన్ లేదా ఉద్యోగం దక్కించుకోలేకపోతే, అదే వారి చివరి పని దినం (  అవుతుందని కంపెనీ తేల్చిచెప్పింది.మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ మోడల్‌ను సరళీకృతం చేయడానికి, సంస్థను దీర్ఘకాలిక విజయం వైపు నడిపించడానికి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అడిడాస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ తమకు అత్యంత వ్యూహాత్మకమైన మార్కెట్ అని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణంలో ఇండియా టెక్ హబ్ ఎప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ పేర్కొన్నప్పటికీ, అకస్మాత్తుగా వెలువడిన ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

[Adidas layoffs, Adidas India job cuts, Gurugram tech hub, Adidas tech layoffs, India tech hub layoff, Adidas news, Telugu One]